పింఛన్ కోసం దివ్యాంగురాలి ఆవేదన
స్పందించని ఇల్లందు శాసన సభ్యుడు
ప్రజా ప్రభుత్వం (Government) నుంచి పెన్షన్ (Pension) ఇప్పించి ఆదుకోవాలని కోరుతూ ఓ దివ్యాంగురాలు (disabled women) ఎమ్మెల్యే (Mla) కాళ్ల మీద పడి వేడుకున్నా ఆయన కనీసం స్పందించలేదు. తనకు మాటలు రావని, చెవులు వినపడవని, దివ్యాంగుల కోటాలో పింఛన్ ఇవ్వాలని కోరుతూ మంజుల అనే దివ్యాంగురాలు ఇల్లందు ఎమ్మెల్యే (Yellandu Mla) కోరం కనకయ్య (Koram Kanakaiah) (కాంగ్రెస్) కాళ్ల మీద పడి ప్రాధేయపడింది. కన్నీటిపర్యంతమైంది.

అయినా ఆయనలో చలనం లేకపోవటం స్థానికులను ఆశ్చర్యపర్చింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రాయికుంట గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలో పర్యటించిన కోరం కనకయ్యకు మంజుల తన బాధను సైగలతో వ్యక్తం చేయటం అక్కడున్నవారిని కలచివేసింది. రెండేళ్ల నుంచి పెన్షన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవట్లేదని తీవ్రంగా వాపోయింది.

పుట్టుకతోనే మూగ, చెవుడని, రెండేళ్ల కిందట భర్త గుండెపోటు(Heart Attack)తో చనిపోయాడని, ఇలాంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభుత్వమే ఆర్థికంగా అండగా నిలవాలని ఆవేదన వ్యక్తం చేసింది.

