కలకత్తా హైకోర్టు అనూహ్య తీర్పు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల(Defection Mla)పై కఠిన చర్యలు తీసుకునే విషయంలో దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచో చర్చలు జరుగుతుండగా దీనిపై కలకత్తా హైకోర్టు (Calcutta High Court) ఇవాళ అనూహ్యమైన తీర్పు (Unexpected Verdict) వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేను ఆ పదవికి అనర్హుడి(Ineligible)గా ప్రకటించింది. పశ్చిమ బెంగాల్(West Bengal)లో బీజేపీ (BJP) టికెట్ మీద గెలిచి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(TMC)లో చేరిన కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్(Mukul Roy)కి న్యాయస్థానంలో చుక్కెదురైంది.
బీజేపీ నాయకులు దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ముకుల్ రాయ్‌ను ఎమ్మెల్యేగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ(Telangana)లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు (Brs Party Mla) కొందరు కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులగా ప్రకటించాలని కోరింది. ఆ కేసు విచారణ ప్రస్తుతం కోర్టులోను, శాసన సభ స్పీకర్ వద్ద కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కలకత్తా హైకోర్టు ఇలాంటి జడ్జిమెంట్ ఇవ్వటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
