Saturday, March 28, 2026
Homeరంగారెడ్డిమాజీ కార్పొరేటర్ తో కలిసి ఎల్ఓసి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే..

మాజీ కార్పొరేటర్ తో కలిసి ఎల్ఓసి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే..

మల్కాజిగిరి నియోజకవర్గం, మల్కాజిగిరి డివిజన్ రాధాకృష్ణ నగర్ కాలనీకి చెందిన జయంతి లాల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల జయంతి లాల్ వైద్యానికి మంజూరైన 2,00,000( రెండు లక్షల రూపాయలు) విలువైన ఎల్ఓసి పత్రాలను బుధవారం బోయిన్ పల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ తో కలిసి బాధితునికి ఎల్ఓసి పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంక్షేమ సహాయనిది పేదలు అనారోగ్యానికి గురైన సమయంలో వారికి ఆపన్న హస్తంలా ఉపయోగపడుతుందని అన్నారు.నిరుపేదల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారి సంక్షేమానికి పాటుపడుతున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి బాధితుడు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ వెంకన్న, చిన్న యాదవ్, నవీన్, మధుసూడాన్ రెడ్డి,శివ గౌడ్,సుమన్ గౌడ్,సుమన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News