- మకాం మార్చిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే……
- నువ్వా నేనా ? గెలిపెవరిది అంటూ ఎత్తుకు పైఎత్తులు……
- ప్రత్యర్ధ చైర్పర్సన్ రేసులో ఉన్నవారిని ఓడించాలని కసి తో ప్రచారాలు
ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించేలా ఎత్తుకు పైఎత్తువేసి నర్సంపేట మున్సిపాలిటీ పీఠం దక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎత్తుకు పై ఎత్తు వేస్తూ కసి తో ప్రచారాలు చేస్తున్నారు. అదేవిధంగా బిజెపి పార్టీ డాక్టర్ రానా ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో 30 కౌన్సిలర్ సీటులో 30 మందిని నిలబెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
నర్సంపేటలో మున్సిపాలిటీ పరిధిలో 30 కౌన్సిలర్ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 30 మందిని దింపి బీసీ మహిళ చైర్పర్సన్ కోసం ఎలాగైనా సీటును కైవసం చేసుకోవాలని హనుమకొండలో ఉండే ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి నర్సంపేట క్యాంప్ ఆఫీస్ మకాం మార్చారు. అదేవిధంగా ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హనుమకొండ నుండి నర్సంపేట పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ రిసార్టుకు తన మకాం మార్చుకొని ఉదయం నుండే ప్రచారాలు సురువు చేస్తున్నారు.

కాగా 30 సీట్లలో 30 మావే అంటూ ఇరువురు నేతలు ప్రెస్మీట్లో గట్టిగా చెప్పడం పలువురిని విస్మయానికి గురిచేస్తుంది. ఇటీవల నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ సమీకరణాలు తీవ్రంగా మారి ఆయా పార్టీలు బలంగా పుంజుకున్నాయి. దీంతో గెలుపోటములు అతి చేరువలో ఉండడంతో బిఆర్ఎస్ మదిలో ఉన్న చైర్ పర్సన్ రేస్ లో ఉన్న వారిని ఎలాగైనా ఓడించి నర్సంపేట మున్సిపాలిటీ పట్టు సాధించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతూ ఓటరు ఆకర్షించేలా సీసీ రోడ్లు, సైడ్ డ్రేయిన్లు, పార్కుల అభివృద్ధి, సెంట్రల్ లైటింగ్ సిస్టం, చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యమంటూ ముందుకు సాగుతున్నారు.
ఇదే తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో పాటు నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబానికి బాకీ ఉందని ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు పరచడం లేదని భాకి కార్డును ఓటర్లకు పంచుతూ ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ చైర్ పర్సన్ రేస్ లో ఉన్న వారిని కసితీరా ఓడించాలని గట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. రెండు ప్రధాన పార్టీలు కొట్టుకుంటుంటే బిజెపి పార్టీకి సందు దొరకక తప్పదని సగం వరకు కౌన్సిలర్ సీట్లను గెలుపొందడం ఖాయమని బిజెపి పార్టీ విస్తృత ప్రచారం చేస్తుంది.
ఇరు పార్టీలు దొంగ పార్టీలే అని ప్రజల్లో చైతన్యo రగిలిస్తూ ముందుకు సాగుతుంది. సర్వేల ప్రకారం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు మేమే 30 గెలిచి చైర్ పర్సన్ సీటు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 11న జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటరును ప్రలోభై పెట్టేనా గెలుపే లక్ష్యంగా చికెన్, మటన్, మందు, స్పోర్ట్స్ కిట్లు, డబ్బు అందించైనా గెలవాలని తపనతో, ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉండడం విశేషం.
