Tuesday, May 12, 2026
Homeఆదిలాబాద్MLA | అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MLA | అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సోమవారం స్మార్ట్ ఫోన్లు అందజేశారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల వివరాలు, పౌష్టికాహార పంపిణీ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయడానికి ఈ ఫోన్లు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. డిజిటల్ సేవలను మరింత బలోపేతం చేయడానికి ఈ పంపిణీ జరిగిందని, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు, సర్పంచులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News