Wednesday, February 11, 2026
Homeఅంతర్జాతీయంBRICS | నౌకాదళ విన్యాసంలో ఇండియా పాల్గొనలేదు

BRICS | నౌకాదళ విన్యాసంలో ఇండియా పాల్గొనలేదు

బ్రిక్స్ నౌకాదళ విన్యాసం(BRICS Naval Exercise)గా చెప్పుకునే కార్యక్రమంలో ఇండియా(India) పాల్గొనలేదని విదేశీ వ్యవహారాల శాఖ(Ministry of External Affairs) శనివారం స్పష్టం చేసింది. వాస్తవానికి అది బ్రిక్స్ సంస్థాగత కార్యక్రమం కాదని పేర్కొంది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి(Official Spokesperson) రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) ఒక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమం పూర్తిగా దక్షిణాఫ్రికా ఆధ్వర్యంలో జరిగిందని, ఇందులో కొన్ని బ్రిక్స్ దేశాలు మాత్రమే పాల్గొన్నాయని అన్నారు. ఇది సాధారణ లేదా అధికారిక బ్రిక్స్ కార్యక్రమం కాదని, సభ్య దేశాలన్నీ పాల్గొనలేదని తెలిపారు. మన దేశం గతంలో కూడా ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనలేదని పేర్కొన్నారు. బ్రెజిల్, దక్షిణాఫ్రికా నావికా దళాలు పాల్గొన్న IBSAMAR నావల్ ఎక్సర్‌సైజ్‌లో మాత్రమే ఇండియా పాలు పంచుకుందని, IBSAMAR కార్యక్రమం చివరి ఎడిషన్ 2024 అక్టోబర్‌లో జరిగిందని జైస్వాల్ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News