మందమర్రి(Mandamarri) పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో నూతనంగా ప్రవేశపెట్టిన మందమర్రి–రామకృష్ణపూర్(వయా) మంచిర్యాల షెడ్యూల్ ఆర్టీసీ బస్సు(RTC Bus)ను కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్(Minister Vivek) బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ప్రజా రవాణా సేవలు(Public Transport Services) అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామాలను, పట్టణాలను అనుసంధానించేలా ఆర్టీసీ సేవల(RTC Services)ను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఈ కొత్త బస్ సేవతో మందమర్రి, రామకృష్ణాపూర్ పరిసర ప్రాంతాల ప్రజలకు జిల్లా కేంద్రం మంచిర్యాలకు వెళ్లే ప్రయాణం మరింత సులభంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్టీసీ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మిక సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొత్త బస్ ప్రారంభం పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.
