Tuesday, February 10, 2026
Homeఆదిలాబాద్Vivek | గణతంత్ర వేడుకల్లో మంత్రి వివేక్

Vivek | గణతంత్ర వేడుకల్లో మంత్రి వివేక్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (ప్రస్తుతం మంచిర్యాల జిల్లా) చెన్నూరు ఎమ్మెల్యే (Chennur Mla) క్యాంప్ ఆఫీసులో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాల(Republic Day Celebrations)ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక, గనులు, ఉపాధి శాఖల మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek) పాల్గొని జాతీయ జెండా(National Flag)ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. మన రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిందని తెలిపారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశాభివృద్ధికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులు, యువత, పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలుచేస్తోందని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా జరిగాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News