ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలపై ప్రశ్నోత్తరాలు జరిగినప్పుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satya Kumar Yadav) సమాధానం ఇచ్చారు. మార్కాపురం పట్టణంలో 640 పడకలతో ఆసుపత్రి నిర్మిస్తున్నాం అని ఆయన ప్రకటించారు. గిద్దలూరు, కనిగిరి, కోవూరు నియోజకవర్గ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది నియామకాలు జరుగుతాయని తెలిపారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మార్కాపురంలో ఆసుపత్రి, వైద్య కళాశాల నిర్మాణానికి కేవలం రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో వైద్య కళాశాలను నిర్మాణం చెయ్యాలని నిర్ణయించినట్టు తెలిపారు. కనిగిరి ఆసుపత్రి సరికొత్త సదుపాయాలతో తీర్చిదిద్దిన ఎమ్మెల్యే నర్సింహా రెడ్డి ని అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమల చెయ్యబోతున్న ఉచిత యూనివర్సల్ హెల్త్ పాలసీ వాళ్ళ ప్రభుత్వానికి రూ. 750 కోట్లు ఆదా అవుతుందని మంత్రి సత్య కుమార్ యాదవ్(Minister Satya Kumar Yadav) తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పన్ను రేట్లు గురించి ఆయన మాట్లాడుతూ కొత్త పన్ను రేట్లు వల్ల మధ్య తరగతి కుటుంబాలు ఎంతో లబ్ధి పొందుతారని అని అన్నారు.
ఇది కూడా చదవండి :