Tuesday, February 10, 2026
Homeఖమ్మంPuligundala | అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

Puligundala | అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

అడవుల సంరక్షణ, అభివృద్ధిలో వన సంరక్షణ సమితుల(Vana Samrakshana Samithi-VSS) పాత్ర కీలకమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. కల్లూరు మండల పరిషత్(Kallur Mandal Parishad) ఆవరణలో నూతనంగా నిర్మించిన వీఎస్‌ఎస్‌ సమావేశ మందిరాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే(Sattupalli MLA) డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌(Matta Ragamayi Dayanand), కలెక్టర్‌తో కలిసి ప్రారంభించారు. ​‘కనకగిరి, పులిగుండాల అటవీ ప్రాంతం సుమారు 35 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. విదేశాల్లోని పర్యాటక ప్రాంతాల(Tourism Place)కు దీటుగా వీటిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

అడవులను కాపాడుకుంటూనే స్థానిక గిరిజనులకు లబ్ధి చేకూర్చేలా ఎకో-టూరిజం(Eco Tourism) ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాను. ​వన సంరక్షణ సమితుల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఒక సమితిని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రూ.20 లక్షలు ప్రకటించాం’ అని చెప్పారు. అనంతరం.. పులిగుండాల విహార యాత్ర కోసం రెండు వాహనాలను ప్రారంభించి, సమితి సభ్యులకు కుటీర పరిశ్రమల యూనిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News