Tuesday, March 3, 2026
Homeఖమ్మంPonguleti | అభివృద్ధి, సంక్షేమంలో తగ్గేదేలే

Ponguleti | అభివృద్ధి, సంక్షేమంలో తగ్గేదేలే

పాలేరు నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

రెండేళ్ల కిందట మీరు ప్రజాప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అప్పుడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకొని పాలేరు నియోజకవర్గం(Paleru Constituency)లో ఎక్కడా తగ్గకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను(Development and Welfare Programmes) అందిస్తున్నామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి(Minister of Revenue, Housing and Information) పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. ఖమ్మం కార్పొరేషన్(Khammam Corporation) పరిధిలోని విద్యానగర్‌లో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టు పనులకు శంకుస్థాపన చేశారు.

- Advertisement -

ఏదులాపురం మునిసిపాలిటీ పరిధిలోని నాయుడుపేటలో రూ.కోటీ రెండు లక్షల యాభై వేల వ్యయంతో అంతర్గత సీసీ రోడ్లు, బస్ షెల్టర్, జంక్షన్ అభివృద్ధి, కమ్యూనిటీ హాల్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. నడిమితండాలో రూ.77.10 లక్షలు, గొల్లగూడెంలో రూ.37.20 లక్షలు, జలగం నగర్‌లో రూ.29.30 లక్షలు, బారుగూడెంలో రూ.24.27 లక్షలు, ఆటో నగర్‌లో రూ.17.20 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

​ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) పదేళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం పేదవాడి కష్టాలను పట్టించుకోలేదని, రేషన్ కార్డులు(Ration Cards) అడిగితే మొహం చాటేశారని మండిపడ్డారు. పదేళ్లు కొత్త రేషన్ కార్డులే ఇవ్వకుండా దగా చేసిన పాలకుల తీరును ఎండగట్టారు. ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ కార్డులు అందజేయడమే కాకుండా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణలో సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు.

గతంలో హాస్టళ్లలో పేద పిల్లలకు సరైన తిండి పెట్టలేదని, ప్రజా ప్రభుత్వం వచ్చాక డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మెటిక్స్ ఛార్జీలను ఏకంగా 200 శాతం పెంచి పేద విద్యార్థులకు అండగా నిలిచామని వివరించారు. ​సొంత ఇల్లు లేని ప్రతి పేదవాడికి గూడు కల్పించడమే తమ ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేపడతామని, ఈ ప్రక్రియ దశల వారీగా నిరంతరం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. పేదవారికి ఎల్లవేళలా అండగా ఉండే విధంగానే ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని, రాబోయే ఎన్నికల్లోనూ ప్రజల దీవెనలు ఇలాగే కొనసాగాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News