Monday, January 19, 2026
EPAPER
Homeఖమ్మంPonguleti | రాహుల్‌ గాంధీని ప్రధానిని చేద్దాం

Ponguleti | రాహుల్‌ గాంధీని ప్రధానిని చేద్దాం

తోట దేవి ప్రసన్న ప్రమాణస్వీకారంలో మంత్రి పొంగులేటి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత(Congress Party Senior Leader), లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు(Oppostion Leader In Lok Sabha) రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని ప్రధానమంత్రి(Prime Minister)ని చేయడమే లక్ష్యంగా కలిసి పార్టీ కోసం పనిచేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పార్టీ శ్రేణులకు సూచించారు. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురం మంత్రులం ఉన్నామని, అన్నదమ్ముల మాదిరిగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడమే మా అందరి ఆలోచన అని తెలిపారు. కొత్తగూడెం కార్పొరేషన్ మీద మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఎగరవేయాలని కోరారు.

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem) జిల్లా కాంగ్రెస్ కమిటీ(DCC) అధ్యక్షురాలిగా కొత్తగా నియమితులైన తోట దేవి ప్రసన్న(Thota Devi Prasanna) ప్రమాణస్వీకార కార్యక్రమం(Oath-Taking Ceremony) సోమవారం జరిగింది. ఇందులో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నేతలు, కార్యకర్తలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..

‘తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధానిని చేయడంలో కీలక పాత్ర పోషించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానాలను బంగారు పళ్లెంలో పెట్టి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలుగా, అభిమానులుగా, కుటుంబ సభ్యులుగా, మనందరిపైన ఉంది. ప్రజా ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురం మంత్రులం ఉన్నాం. మాలో ఎవరికీ ఎలాంటి భేషజాలూ లేవు. ఎవరెన్ని అసత్య ప్రచారాలు చేసి మాపై కుట్రలు పన్నినా కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ నమ్మొద్దు.

కాంగ్రెస్ పార్టీని ఇంకా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక పెద్ద మహావటవృక్షం. ఆ వృక్షం పచ్చగా ఉంటేనే మనమందరం చల్లగా ఉంటాం. ఆ చెట్టుకొమ్మలు, మొదలును నరుక్కుంటే ప్రమాదంలో పడేది మనమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎన్నో ఏండ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ, కన్నీళ్లు పెట్టుకుంటూ, జెండాను మోస్తూ పోరాటం చేసిన కార్యకర్తలకు అన్నివేళలా మీ ఇంటి పెద్ద కొడుకుగా, ఒక తమ్ముడిగా, అన్నగా అండగా ఉంటాను.

ఎన్నికలు, అధికారం, పదవులు వస్తుంటాయి పోతుంటాయి. ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఉన్నదానికన్నా మరింత బలోపేతం చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనేలా చేయడంలో అందరం కృషి చేయాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా దీవెనలతో కాంగ్రెస్ పార్టీకి మంచి విజయాలు వచ్చాయి. త్వరలో కార్పొరేషన్, మునిపల్ ఎన్నికలు జరగనున్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ మీద మూడు రంగుల మువ్వన్నెల జెండాను ఎగరవేయడమే మన లక్ష్యంగా పనిచేయాలి’ అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News