వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Agriculture Minister Tummala Nageswara Rao) తెలంగాణ విత్తన ముసాయిదా చట్టం(Telangana Seed Draft Act)-2025పై డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. డ్రాఫ్ట్ కమిటీ ప్రతిపాదించిన ముసాయిదా చట్టం విధివిధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో విత్తనం అనేది ప్రాథమిక అవసరమని చెప్పారు. నకిలీ విత్తనాల(Fake seeds)తో తీవ్ర నష్టం వస్తోందని తెలిపారు. విత్తన చట్టం-1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు-1983 అమలులో లోపాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, చట్టంలోని బాలహీనతలను విత్తన సంస్థలు (Seed companies) దుర్వినియోగం (Misuse) చేస్తున్నాయని అన్నారు.

ఈ సమస్యను అధిగమించేందుకు వీలుగా డ్రాఫ్ట్ కమిటీ వేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుత విత్తన చట్టాల వివరాలు, వాటిలోని లోపాలు, ఫలితంగా రైతులకు జరుగుతున్న నష్టాన్ని కమిటీ సభ్యులు వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంచాలకులు B.గోపి, సీడ్ కార్పొరేషన్ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, అడ్వకేట్ సునీల్ కుమార్, సీడ్ డైరెక్టర్ M.V నగేష్ కుమార్, ED రామాంజినేయులు, శ్రీనివాస్ రెడ్డి, పాలసీ నిపుణులు D. నరసింహారెడ్డి, K.శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
