రేపు అధికారికంగా ప్రారంభం
పాల్గొననున్న మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ‘మీసేవ’ (Meeseva) ఇకపై వాట్సాప్(WhatsApp)లో అందుబాటులోకి వస్తోంది. ఈ కార్యక్రమాన్ని రేపు (నవంబర్ 18న) మంత్రి శ్రీధర్‌బాబు (SridharBabu) ప్రారంభించనున్నారు. బంజారాహిల్స్‌లోని హోటల్ తాజ్ కృష్ణ(Taj Krishna)లో ఈ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఏర్పాటుచేశారు. ప్రభుత్వం మీ-సేవ ద్వారా అందించే సేవలకు సంబంధించిన సమాచారాన్ని, అధీకృత పత్రాలను కూడా ఇక నుంచి వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పొందొచ్చు. ముఖ్యంగా.. దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్‌కు సంబంధించిన ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? ఆమోదం పొందిందా? లేదా! అనే వివరాలనూ వాట్సాప్ ద్వారా తెలుసుకునే వీలుంటుందని అధికారులు చెప్పారు.
- Advertisement -
