Tuesday, October 28, 2025
ePaper
HomeఫోటోలుMana Shankaravaraprasad Garu | ‘మీసాల పిల్ల’ ట్రెండింగ్‌

Mana Shankaravaraprasad Garu | ‘మీసాల పిల్ల’ ట్రెండింగ్‌

మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) “మన శంకరవరప్రసాద్ గారు(Mana Shankaravaraprasad Garu)” ఫస్ట్ సింగిల్(Fist Single) – మీసాల పిల్ల (Meesala Pilla) వైరల్ సెన్సేషన్‌, 36 మిలియన్ వ్యూస్‌తో గత 13 రోజులుగా ఇండియాలో నంబర్-1 ట్రెండింగ్‌(Trending)గా నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లతో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారడమే కాకుండా తెలుగు పాటకు దేశవ్యాప్తంగా అరుదైన ఘనతను సాధించింది.

విడుదలైన కొద్ది రోజుల్లోనే మీసాల పిల్ల యూట్యూబ్ మ్యూజిక్ ఇండియాలో నంబర్ 1 స్థానానికి చేరుకుంది. వరుసగా 13 రోజులు అగ్రస్థానాన్ని కొనసాగించి 36 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఈ పాట పాన్-ఇండియా సంచలనంగా మారింది, నేషనల్ మ్యూజిక్ స్టేజ్ పై తెలుగు సినిమాకు ఇది ప్రౌడ్ మూమెంట్. మన శంకర వర ప్రసాద్ గారు పండుగ వాతావరణంలో కుటుంబ భావోద్వేగాలు, వినోదం, నాస్టాల్జియాతో నిండిన ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. “మీసాల పిల్ల” పాట చిరంజీవి గారి టైమ్‌లెస్ చార్మ్, అద్భుతమైన డాన్స్ మూవ్స్, హ్యుమర్ తో ఆకట్టుకుంటోంది. ఇందులో హీరోయిన్‌గా నటించిన నయనతారతో ఆయన కెమిస్ట్రీ కొత్తదనాన్ని తీసుకొచ్చింది.

ఈ పాటలోని ఎనర్జిటిక్ బీట్‌లు సంగీత దర్శకుడు భీమ్స్ సెసిరోలియో అద్భుతంగా సమకూర్చారు. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ వోకల్స్ పాటకు నాస్టాల్జిక్ టచ్ ఇచ్చి అందరికీ ఒకేలా కనెక్ట్ అవుతోంది. ఈ పాటలోని క్యాచీ హుక్ స్టెప్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానులు పెద్ద ఎత్తున రీ క్రియేట్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రంలో పూర్తి స్థాయి కీలక పాత్రలో కనిపించనుండటం సినిమా మీద అంచనాలను మరింత పెంచింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని భారీ సెట్‌పై వేగంగా సాగుతోంది. సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News