ఆలోచనలు నిండిన చిత్తం
నవనవోన్మేష ఆశల మోసులెత్తు!
అంతరంగమున వెలిగిన జ్ఞాన పుంజం
చక్షు న్మీలిత బుద్ది దివ్యజ్ఞాన రూపమెత్తు!
- Advertisement -
వచియించిన వజ్ర వాక్కుల గుణము
క్షుద్రముల ఖండించు గనమై ఖడ్గమెత్తు!
సహస్రార చక్ర చైతన్యం
సంచిత కర్మల రూపుమాపు!
పరమాత్ముని పరిపరి విధముల
భక్తిగాన స్త్రోత్రమ్ములెటు వెల్లువెత్తు
ఆ ప్రాంతమ్ములు చరితార్థమ్ములు!
నిత్య సత్య ధర్మాచరణ లు
నిజముగా నిలుపునట్టి హృది
పరమానంద భగవత్ సన్నిధి!
- పట్లోళ్ళ బక్కారెడ్డి
- Advertisement -
