మెదక్ ఎమ్మెల్యే (Medak Mla) మైనంపల్లి రోహిత్ రావు (Mynampally Rohit Rao) స్వయం సహాయక సంఘాల(SHGs)కు రూ.30 కోట్ల వడ్డీ లేని రుణాల(VLR)ను పంపిణీ చేశారు. కోటి మంది మహిళల (Women)ను కోటీశ్వరులను చేస్తామన్న ప్రభుత్వ (Government) ప్రతిజ్ఞను పునరుద్ఘాటించారు. మెదక్ జిల్లా శంకరంపేట మండలంలోని రైతు వేదికలో మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్‌తో కలిసి హాజరయ్యారు. మెదక్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా విడుదలైన రూ2.88 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వడ్డీ లేని రుణాల మూడో విడత పంపిణీ.. మహిళలను ఆర్థికంగా సాధికారపరచాలనే ప్రభుత్వ వాగ్దానంలో భాగమని చెప్పారు.
- Advertisement -
