- రోబోలతో పనిచేసేలా ప్లానింగ్
2033నాటికి అమెజాన్ ఐదులక్షల మంది ఉద్యోగులను రోబోలతో భర్తీ చేయనుంది. అంతర్గత పత్రాలు, సమీక్షించిన ఇంటర్వూలను ఉదహరిస్తూ జాతీయ మీడియా మంగళవారం ఈ అంశంపై ఒక నివేదికను ప్రచురించింది. 2027 నాటికి యాంత్రీకరణ 1,60,000 అదనపు ఉద్యోగాలను నివారించగలదని సంస్థ విశ్వసిస్తోందని పేర్కొంది. దీంతో అమెజాన్ ఉద్యోగుల నియామకాల వేగాన్ని తగ్గించనుందని నివేదిక తెలిపింది. అమెజాన్ రోబోటిక్స్ బృందం కంపెనీ మొత్తం కార్యకలాపాల్లో 75శాతం యాంత్రీకరణను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. ఈ చర్య ఇప్పటి నుండి 2027 వరకు సంస్థ 12.6 బిలియన్ డాలర్లు (సుమారు 1105 కోట్లు) ఆదా చేసేందుకు అనుమతిస్తుంది. వినియోగదారులకు అందించే ఒక్కో వస్తువుపై 30 సెంట్లు ఆదా చేయగలదని పేర్కొంది.
