- చిలిపిచేడ్ ఏఎస్ఐ రాములు
పోలీసు అమరవీరుల త్యాగాలు మరువబోమని చిలిపిచేడ్ ఏఎస్ఐ రాములు పేర్కొన్నారు.మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో విధి నిర్వహణలో అమరులైన పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏఎస్ఐ రాములు మాట్లాడుతూ… అమరుల త్యాగాలు మరువలేమని,అమరుల ఆశయ సాధన కోసం కృషి చేస్తామని,ప్రజల భద్రతే తమ కర్తవ్యమని,శాంతి భద్రతల విషయంలో ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రాములు,హెడ్ కానిస్టేబుల్ నర్సింలు,ఎలియాస్ రెడ్డి,సిబ్బంది చెన్నుస్వామి,దేవీసింగ్,సతీష్, దుర్గాప్రసాద్,సాయి,జాన్, పాల్గొన్నారు.
