Wednesday, February 11, 2026
HomeజాతీయంChhattisgarh | 63 మంది మావోయిస్టుల లొంగుబాటు

Chhattisgarh | 63 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ(Dantewada) జిల్లాలో శుక్రవారం 63 మంది మావోయిస్టులు(Maoists) లొంగిపోయారు(Surrender). ఇందులో 36 మందిపై రూ.1.19 కోట్లకు పైగా బహమతి(Reward) ఉంది. పోలీసులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ఎదుట సరెండర్ అయినవారిలో 18 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అమలుచేస్తున్న ‘లొంగుబాటు, పునరావాస’ విధానం(Surrender and Rehabilitation Policy) తమను ఆకట్టుకుందని, అందుకే లొంగిపోయామని మావోలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. సరెండర్ అయినవారికి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున తక్షణ సహాయం అందిస్తామని చెప్పారు. ఈ నెల 7న 26 మంది మావోయిస్టులు లొంగిపోయిన సంగతి తెలిసిందే. 2025లో 1500 మందికి పైగా మావోలు సరెండర్ అయ్యారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం(Union Government) ఈ ఏడాది మార్చి 31 నాటికి నక్సలిజాన్ని దేశం నుంచి పూర్తిగా పారదోలాలని లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News