Wednesday, March 18, 2026
Homeరంగారెడ్డిManikanta Goud | సొంత నిధులతో మజీద్ కు బాత్రూంలు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం

Manikanta Goud | సొంత నిధులతో మజీద్ కు బాత్రూంలు సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం

  • ప్రజల ప్రశంసలు అందుకుంటున్న మణికంఠ గౌడ్

ఎల్లంపేట మున్సిపల్ పరిధి రాయిలాపూర్ లోని పెద్ద మసీదుకు మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత రామన్న గారి మణికంఠ గౌడ్ రెండు బాత్రూంలతోపాటు, ఒక సెప్టిక్ ట్యాంక్ ను తన సొంత నిధులతో నిర్మించారు. గత కొద్ది రోజుల నుండి మసీదుకు బాత్రూంలు లేకపోవడం వల్ల ముస్లిం సోదరులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఈ సమస్యను ముస్లిం సోదరులు మణికంఠ గౌడ్ దృష్టికి తీసుకురావడంతో దాదాపు లక్ష రూపాయల సొంత డబ్బులతో మసీదుకు రెండు బాత్రూంలతోపాటు సెప్టిక్ ట్యాంక్ ను నిర్మించి ఇచ్చారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మణికంఠ గౌడ్ ను ప్రశంసించారు. అడగగానే మసీదుకు రెండు బాత్రూంల తో పాటు సెప్టిక్ ట్యాంకును నిర్మించి ఇవ్వడం అభినందనీయమని ముస్లిం సోదరులు పేర్కొన్నారు.

- Advertisement -

ఘనంగా ఇఫ్తార్ విందు

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని రాయిలాపూర్ లోని పెద్ద మసీదులో మాజీ కౌన్సిలర్,కాంగ్రెస్ నేత రామన్న గారి మణికంఠ గౌడ్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మణికంఠ గౌడ్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో యువ నాయకులు మోనార్క్,మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News