Thursday, March 5, 2026
Homeఆంధ్రప్రదేశ్AP Government | మన బడి - మన బాధ్యత

AP Government | మన బడి – మన బాధ్యత

పాఠశాల విద్య(School Education) ప్రమాణాలను మెరుగుపరిచేందుకు(Improve Standards) ఏపీలోని గుంటూరు జిల్లా యంత్రాంగం(Guntur District Administration) వినూత్న కార్యక్రమం(Innovative Programme) ప్రారంభించింది. ముఖ్యంగా 9, 10 తరగతి విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి, ఉన్నత విద్యా, ఉద్యోగ అవకాశాల పట్ల అవగాహన కల్పించడం, తద్వారా 10వ తరగతి పరీక్షల్లో శత శాతం ఫలితాలు సాధించడం లక్ష్యంగా “మన బడి – మన బాధ్యత”(Man Badi – Mana Badhyatha) కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు.

ఈ మేరకు జిల్లాలోని 185 ఉన్నత పాఠశాలలకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించి వాటిపై పర్యవేక్షణకు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. 9, 10 విద్యార్థుల్లో మానసిక ఆందోళన తగ్గించడం, చదువు పట్ల ఏకాగ్రత కలిగించడం, విద్యార్థులు ఏ సబ్జెక్టుల్లో వెనకబడి ఉన్నారో గుర్తించి వాటిలో మంచి తర్ఫీదు ఇవ్వడం, అందులో ఉన్న భయం పోగొట్టడం, అదే సబ్జెక్టులో ఉన్నత విద్య అభ్యసించి అందులో నిపుణులుగా తయారయ్యేలా మలచడం వంటి అంశాల పట్ల దృష్టి సారించారు. విద్యార్థులకు ప్రత్యేక అధికారులు మార్గదర్శిగా, కౌన్సిలింగ్ అందిస్తారు.

- Advertisement -

వివిధ రంగాల్లో విజయాలు సాధించిన వ్యక్తుల జీవిత చరిత్రలు తెలియజేస్తూ ప్రేరణ కలిగిస్తారు. జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా మాట్లాడుతూ.. విద్యార్థులు సరైన అవగాహనలేక అనేక అవకాశాలు చేజార్చుకుంటున్నారన్నారు. విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వం, సూచనలు, సలహాలు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు అందించడం వల్ల భవిష్యత్తుకు గట్టి పునాది పడుతుందన్నారు. అందుకే “మన బడి – మన బాధ్యత” కార్యక్రమాన్ని అమలుచేస్తూ జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించామని అన్నారు.

అధికారుల స్వీయ అనుభవాలు కూడా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంచడం, మానసిక స్థైర్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News