- చివరికి చెరసాలకు..
పనస మధు, (30) నిరుద్యోగి, BC-B (Gouds), కులానికి చెందిన మధు అల్కాపురి కాలనీ కొత్తపేట్ లో నివాసం ఉంటున్నాడు. ఇతని సొంత చిరునామ: చెరువుపల్లి గ్రామం, మాడుగులపల్లి మండలం, నల్గొండ జిల్లా వాసి, తాను FCI లో Grade-3, టెక్నికల్ మేనేజర్ గా చెర్లపల్లి నందు జాబ్ చేస్తున్నట్టు నకిలీ ID Card ను తయారుచేసి FCI చర్లపల్లి లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించి, నల్గొండ జిల్లా వాసి అయిన బాదితురాలి తో 2 కోట్లు డిమాండ్ చేసి, ఒకటిన్నర కోటి రూపాయల వరకట్నం కుదుర్చుకొని నల్గొండ లో నిశ్చితార్థం చేసుకున్నాడు.
అనంతరం ఫ్రీ వెడ్డింగ్ షూట్ అనే పేరు చెప్పి తాను ఉంటున్న రూమ్ కు దగ్గరకు వచ్చిన బాదితురాలి పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ, ఆమెపై నిందలు వేస్తూ ఇబ్బంది పెట్టినాడు. ఆ తరువాత బాధితురాలికి అతనిపై అనుమానం వచ్చి అతని గురించి విచారించగ అతను నకిలీ ID Card ను తయారుచేసి FCI చర్లపల్లి లో ఉద్యోగం చేస్తున్నట్టు నమ్మించినాడు అని విషయం తేడాతెళ్లమైంది.
తను మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఇట్టి విషయంపై తగు విచారణ జరిపి అతనిపై చర్య తీసుకునే నిమిత్తం ఇచ్చిన దరఖాస్తుపై కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకొని అతని దగ్గర నుండి నకిలీ FCI శాఖకు సంబంధించిన ID Card లు రెండు, ఒక మొబైల్ ఫోన్ మరియు ఆన్ గవర్నమెంట్ డ్యూటీ ( On Govt. Duty ) అని వ్రాసి ఉన్న ఒక కారును స్వాధీన పరుచుకొని రిమాండ్ కు తరలించి నట్లు చైతన్యపురి హెచ్ ఓ తెలిపారు.
మాట్రిమోనియల్ విషయాల్లో పలు జాగ్రతలు వహించగలరని కోరుచున్నము. ప్రజలందరూ ఇలాంటి మోసాల నుండి జాగ్రత్తగా ఉండి, ఏవైనా అనుమానాస్పద విషయాలు గమనించినట్లయితే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించగలరు అని సూచించారు చైతన్యపురి పిఎస్ ఇన్స్పెక్టర్.
