Wednesday, March 4, 2026
HomeజాతీయంMamata Banerjee | దేశ చరిత్రనే మార్చేస్తున్నారు..

Mamata Banerjee | దేశ చరిత్రనే మార్చేస్తున్నారు..

  • తమకుఅనుకూలంగా మార్చుకుంటున్న బీజేపీ
  • కేంద్ర ప్రభుత్వంపై మమతా బెనర్జీ ఫైర్..
  • నేతాజీ 129 జయంతి వేడుకల్లో పాల్గొన్న దీదీ..
  • నేతాజీ సేవలు అనన్యసామాన్యమన్న మమత..

చరిత్రను మార్చి తమకు అనుకూలంగా మార్చుకునే దుర్మార్గం కేంద్ర ప్రభుత్వం చేస్తోదని పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా నేతాజీ విమర్శించారు.. సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారామె. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దేశ చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుంటూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, బీఆర్ అంబేడ్కర్ వంటి జాతీయ ప్రముఖులను బీజేపీ, కేంద్ర ప్రభుత్వం అవమానించాయని ఆమె వ్యాఖ్యానించారు.

నేతాజీ.. భారత స్వాతంత్ర సంగ్రామంలో పోషించిన పాత్ర అసమానమైనదని.. ఆయనను కేవలం ఒక విగ్రహానికో లేదా ఫొటోకో పరిమితం చేయకూడదని పేర్కొన్నారు దీదీ. ‘ఢిల్లీ ఛలో’ నినాదాన్ని గుర్తు చేసుకుంటూ.. కేంద్ర ప్రభుత్వం బెంగాల్పై కుట్రలు చేస్తుందని ఫైర్ అయ్యారు మమత. మన సంస్కృతి, భాషను కాపాడుకోవడానికి అందరం ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

జనవరి 23ను ‘జాతీయ సెలవు దినం’గా ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నేతాజీ ఆశయాలను గౌరవించాలంటే సెలవు ప్రకటించడమే కాదు.. ఆయన ఆశయాలను, భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరారు, మన దేశ చరిత్రను బీజేపీ పూర్తిగా వక్రీకరిస్తుందన్నారు. ఇప్పటికైనా నేతాజికి సంబంధించిన సమాచారం మొత్తం బహిర్గతం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నానన్నారామె.

- Advertisement -
RELATED ARTICLES

Latest News