Tuesday, February 10, 2026
Homeవరంగల్‌భక్తజన పర్యాటకులతో కిక్కిరిసిపోయిన మల్లూరు హేమాచల క్షేత్రం

భక్తజన పర్యాటకులతో కిక్కిరిసిపోయిన మల్లూరు హేమాచల క్షేత్రం

ములుగుజిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామం సమీపంలోగల శ్రీ హేమాచల క్షేత్రంపై అనాదిగా వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం లో స్వామివారి దర్శనం కోసం మంగళవారం భక్తులు,పర్యాటక ప్రజలు బారులు తీరి పూర్తిగా రద్దీతో నిండిపోయారు. ఓవైపు నేటి నుంచి నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగనున్న మేడారంసమ్మక్క-సారలమ్మ మహా జాతర కోసం వచ్చిన వేలాది మంది భక్తులు, పర్యాటకులు మల్లూరు.

శ్రీహేమాచల లక్ష్మీనృసింహస్వామి  వారిని కూడా తిరుగు ప్రయాణంలో దర్శించుకుoటున్నారు.భక్తులకు ముందుగా ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆలయ అర్చకులు ముఖులిత  స్వాగతం పలుకుతూ తరువాత వారి పేరు మీద అర్చన చేసి స్వామి వారి విశిష్టత,ఆలయ ప్రాశస్త్యాన్ని వివరించారు.అనంతరం తీర్ధ ప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో భక్తులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్.మహేష్ మే నెలలో జరుగనున్న స్వామివారి బ్రమ్మోత్సవాల కరపత్రాలను అందచేస కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది , భక్తులు, గ్రామస్థులు, ఉత్సవ కమిటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News