జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్
మల్లేపల్లి నాలాలో పూడికతీత, పరిశుభ్రత పనులను చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. సోమవారం మెహదీపట్నం సర్కిల్ పరిధిలోని మల్లేపల్లి నాలాను ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలాలో పేరుకుపోయిన మట్టిని తొలగించే చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. తద్వారా భారీ వర్షాల సమయంలో నాలా సమీప ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. అవసరమైన చోట నాళాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను నిరంతరం కొనసాగించేలా చూడాలని కమిషనర్ సూచించారు. వర్షపు నీరు నిల్వ కాకుండా, నాలాలో స్వేచ్ఛగా ప్రవహించేలా ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆర్.వి. కర్ణన్ ఆదేశించారు.