Thursday, March 5, 2026
Homeరంగారెడ్డిYellampet | ప్రచారంలో మల్లారెడ్డి డాన్స్…

Yellampet | ప్రచారంలో మల్లారెడ్డి డాన్స్…

  • ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోష్
  • రాజా బొల్లారం తండా 4వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చందర్ నాయక్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది.

ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రాజా బొల్లారం తండా 4వ వార్డులో బీఆర్ఎస్అభ్యర్థి చందర్ నాయక్ ఎన్నికల ప్రచారంఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లారెడ్డి పాల్గొని ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపారు. తండా మహిళలతో కలిసి మల్లారెడ్డి ధూమ్ ధామ్ నృత్యాలు చేస్తూ ప్రచారాన్ని ప్రత్యేక ఆకర్షణగా మార్చారు. ఆయన డాన్స్ ప్రచారం అక్కడి ప్రజలను ఆకట్టుకోవడంతో కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది.ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్పార్టీ రెండేళ్ల పాలనలో,అభివృద్ధి,లేదని,విమర్శించారు.తాండాలనుగ్రామపంచాయతీలుగా మార్చింది.

కేసీఆనని,గ్రామగ్రామాల్లో రోడ్లు, పాఠశాలలు, ఇంటింటికినీళ్లు, 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించినఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.బీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు భారీ మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లంపేట మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి, మద్దుల శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ యాదవ్, దయానంద్ యాదవ్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News