Wednesday, February 11, 2026
Homeరంగారెడ్డిCharity | మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ.

Charity | మల్కాజిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ.

మల్కాజిగిరి జిల్లా(Malkajgiri District) ప్రభుత్వ ఆసుపత్రిలో(Government Hospital) సెవెన్ రా ఫౌండేషన్(Seven Raw Foundation) ఆధ్వర్యంలో మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు(patients) గురువారం పండ్లను పంపిణీ(Fruits Distribution) చేశారు. సెవెన్ రా ఫౌండేషన్ హైకోర్టు అడ్వకేట్, చైర్మన్ తిప్పారపు కీర్తి కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కటకం మురళీధర్ హాజరై ఫౌండేషన్ సభ్యులతో కలిసి రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెవెన్ రా ఫౌండేషన్ చైర్మన్ కీర్తి కుమార్ హైకోర్టు అడ్వకేట్ అయి ఉండి చిన్న వయసులో సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందించదగ్గ విషయమని ఒక ఫౌండేషన్ స్థాపించి అతికొద్ది సమయంలోనే అనేక సేవా కార్యక్రమాలను అందిస్తున్నారని అన్నారు.

ఫౌండేషన్ స్థాపించిన రోజును పురస్కరించుకొని రోగులకు పండ్లను పంపిణీ చేయడమే కాకుండా గతంలో విద్యార్థులకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ఎగ్జామ్ ప్యాడ్స్,స్టడీ మెటీరియల్స్ అందించడం లాంటి కార్యక్రమాలను చేసి ఉన్నారని ఫౌండేషన్ సేవలను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ సునీత,ఏవో డాక్టర్ సంగీత్ కుమార్,లతోపాటు తిప్పారపు లక్ష్మణ్, కేశపాగ రామచందర్,సాత్విక్,సమైక్, చుంచు అశోక్,మనోహర్, యాతాకుల అశోక్,రామకృష్ణ, విజయరావు,ప్రణయ్,అంజి, ప్రభాకర్,సంతోష్,వినయ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News