Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణఅప్పుడు ఎంపీ.. ఇప్పుడు సీఎం

అప్పుడు ఎంపీ.. ఇప్పుడు సీఎం

  • మ‌ల్కాజ్‌గిరి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి శూన్యం
  • ఓటేసిన పాపానికి మినీ ఇండియాకి ప్రజలకు తిప్పలు
  • మల్కాజ్‌గిరి మారుతీ నగర్ రహదారి కుప్పకూలిన స్థితి
  • రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన… ప్రజలకు కష్టాలే !

“ఓటేసిన పాపానికి తప్పవా తిప్పలు?” అని మారుతీ నగర్ నుంచి ఏఎస్ రావు నగర్ దాకా ప్రయాణించే వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలు భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురాలేదు. ఈ ప్రాంతానికి గతం లో ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నా, కనీస రోడ్డు మరమ్మతులు కూడా జరగకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ప్రస్తుత ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (టీఆర్ఎస్), మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (కాంగ్రెస్) మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధం వల్ల ప్రజలు నలిగిపోతున్నారు. ఎవ్వరూ బాధ్యత తీసుకోవడం లేదు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సమస్యలపై స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. “ఇది ఇంకేం ప్రజాప్రభుత్వమూ కాదు, నాయకుల ఎజెండాల పాలన మాత్రమే!” అంటూ స్థానికులు మండిపడుతున్నారు.

పరిస్థితి మరింత విషమించకముందే.. ప్రజలలో వ్యతిరేకత రాకముందే జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News