Homeరంగారెడ్డిGandhi Park | మల్కాజిగిరిలో పడకేసిన పరిపాలన

Gandhi Park | మల్కాజిగిరిలో పడకేసిన పరిపాలన

  • సమస్యను తెలిపిన పట్టించుకోని వైనం…
  • చెత్తలో మగ్గుతున్న గాంధీ పార్క్ ,
  • నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు

మల్కాజిగిరి నియోజకవర్గంలో పరిపాలన పడకేయడంతో ప్రధాన కూడలి గాంధీ పార్కులో చెత్తాచెదారం పేరుకపోయి మందుబాబులకు అడ్డాగా, మూత్ర విసర్జనలకు నిలయంగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. గాంధీ పార్క్ లో గల ప్రెస్ క్లబ్, ప్రాథమిక పశు వైద్య కేంద్రానికి పట్టిన దుస్థితి ఇది. ప్రెస్ క్లబ్ పక్కన మట్టి కుప్పలు పేరుకపోవడమే కాక, చుట్టూ చెట్లు, చెత్త చెదారంతో గందరగోళం నెలకొంది.

malkajgiri administration collapse gandhi park neglect issues

సదరు విషయాన్ని సామాజిక మధ్యమైనా వాట్సప్ ద్వారా అధికారులందరున్న గ్రూప్లో విషయాన్ని తెలియజేసిన ఏ ఒక్క అధికారి స్పందించి సమస్యను తీర్చలేదంటే, మల్కాజిగిరిలో ప్రజల పట్ల, వారి వృత్తి ధర్మం పట్ల అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో ఇట్టే అర్థమవుతుంది.

- Advertisement -
malkajgiri administration collapse gandhi park neglect issues 1

అధికారుల తీరు ఇట్లా ఉంటే, ఇక మల్కాజిగిరిలో నాయకుల తీరు రూటే సపరేట్ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరి ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గాంధీ పార్క్ శుభ్రతపై దృష్టి సారించాలని ప్రజల కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News