ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి జరుగుతున్న అభిప్రాయ సేకరణలో భాగంగా ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పరిశీలకుడిగా ఖమ్మం జిల్లాకు వచ్చిన మహీరధన్.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చించారు.

