Saturday, March 7, 2026
Homeతెలంగాణమహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలి

  • తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్

సామాజిక సమానత్వం, విద్యా ప్రసారం, మహిళా సాధికారత, అణగారిన వర్గాల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన మార్గం ప్రతి తరానికి దిశా నిర్దేశమని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొన్నారు.శుక్రవారం రాజేంద్ర నగర్‌లో పూలే విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు.పూలే విలువలు కేవలం చరిత్రలో నిక్షిప్తం కావడానికి కాదు, నేటి సమాజ నిర్మాణానికి పునాదిగా నిలవాలని జ్ఞానేశ్వర్ అన్నారు. ఆయన చూపిన సామాజిక స్ఫూర్తి, సమాన హక్కుల కోసం చేసిన పోరాటం ఇప్పటి తరం ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News