Thursday, February 12, 2026
HomeజాతీయంAjit Pawar | విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం

Ajit Pawar | విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం

మహారాష్ట్రలో బుధవారం జరిగిన విమాన ప్రమాదం(Plane Crash)లో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్(Ajit Pawar) దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం బారామతి ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో పవార్‌తోపాటు మరో నలుగురు కూడా చనిపోయారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన ముంబై నుంచి వెళుతుండగా ఉదయం 8 గంటల 45 నిమిషాలకు విమానం కుప్పకూలింది. దీనిపై డీజీసీఏ ప్రకటన చేసింది. టెక్నికల్ ప్రాబ్లం వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొంది. అజిత్ పవార్‌కు భార్య సునేత్ర పవార్, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పవార్ సతీమణి రాజ్యసభ ఎంపీ. 1959 జులై 22న జన్మించిన అజిత్ పవార్.. సీనియర్ పొలిటికల్ లీడర్. ఎన్సీపీ(ఎస్పీ) అధ్యక్షుడు శరద్ పవార్ పెద్ద సోదరుడు అజిత్ పవార్ కుమారుడు. 23 వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఆరుసార్లు డిప్యూటీ సీఎం అయ్యారు. కాగా.. అజిత్ పవార్ మరణంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News