మడేలయ్య రజక సంఘం అధ్యక్షుడు శనిగరం నరసింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ జవహర్ నగర్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 2026 సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు. చెన్నాపురం దేవేందర్ నగర్ లోని వడ్డెర ఓబన్న విగ్రహానికి పూలమాల సమర్పించారు. మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లా వినయ్ కుమార్, జవహర్ నగర్ బీసీ జేఏసీ సంఘాల అధ్యక్షుడు మారోజు సోమాచారి పాల్గొన్నారు. నాయకులు దేవేందర్, రాజు యాదవ్, అజయ్ కుమార్, అనిల్ పాల్గొన్నారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఓరుగంటి భాస్కర్, ఉపాధ్యక్షులు కస్తూరిపల్లి రాములు, కోశాధికారి ఆర్ రమేష్, జి బాలరాజు, ఎం బాలరాజు, బి సాగర్, ఎస్ సత్తయ్య, వి భాస్కర్, టీ నర్సయ్య, కే శ్రీనివాస్, ఎస్ కనకరాజు, ఏం రాములు, ఏ పవన్ కుమార్, జి అంజయ్య, వి వెంకటయ్య, కే రాజయ్య, సిహెచ్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
