Thursday, February 12, 2026
Homeఅంతర్జాతీయంLuana Lopes Lara | ప్రపంచంలోనే అతిపిన్న మహిళా బిలియనీర్

Luana Lopes Lara | ప్రపంచంలోనే అతిపిన్న మహిళా బిలియనీర్

లుయానా లోప్స్ లారా.. ప్రపంచంలోనే అతిపిన్న మహిళా బిలియనీర్‌(Youngest Self-Made Female Billionaire)గా నిలిచారు. కేవలం 29 ఏళ్ల వయసులోనే స్వతహాగా ఈ ఘనత సాధించారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Massachusetts Institute of Technology-MIT)లో గ్రాడ్యుయేష్ చేసిన ఈ బ్రెజిల్ లేడీ.. కల్షి (Kalshi) అనే స్టార్టప్‌(Startup)కు కోఫౌండర్‌(Co-Founder)గా కెరీర్ స్టార్ట్ చేసి సంపన్నుల జాబితాలో చోటు సంపాదించారు. రీసెంట్‌గా జరిగిన మేజర్ ఫండింగ్ రౌండ్‌లో ఈ స్టార్టప్ వ్యాల్యూ అనూహ్యంగా 11 బిలియన్ డాలర్లకు చేరింది.

నియంత్రిత అంచనా మార్కెట్ ప్లాట్‌ఫామ్‌(regulated prediction market platform)గా వ్యవహరించే ఈ స్టార్టప్.. 1 బిలియన్ డాలర్ల నిధుల రౌండ్ తర్వాత ఇటీవల 11 బిలియన్ డాలర్ల విలువను పొందింది. లుయానా లోప్స్ లారా.. టెక్నాలజీపై దృష్టి సారించే ముందు.. బ్యాలెరినాగా శిక్షణ తీసుకున్నారు. తర్వాత ఎంఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్‌లో డిగ్రీలు పొందారు. అక్కడ పరిమాణాత్మక విశ్లేషణ, సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్‌లో నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు. అవి ఆమె ఆర్థిక, సాంకేతిక వృత్తిలో కీలకంగా మారాయి.

- Advertisement -

లారా 2020లో ఎంఐటీలో తారెక్ మన్సూర్‌తో కలిసి కల్షిని స్థాపించారు. హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సంస్థ ఫైవ్ రింగ్స్ క్యాపిటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తున్నప్పుడు ఆమెకు ఈ ఆలోచన వచ్చింది. కల్షి స్టార్టప్‌లో.. ఎన్నికలు, వాతావరణ నమూనాలు, క్రీడా ఫలితాలు, ఆర్థిక మార్పులు సహా భవిష్యత్ వాస్తవ ప్రపంచ ఘటనలపై ట్రేడింగ్ చేయొచ్చు. ఇది కూడా ఫ్యూచర్స్ ట్రేడింగ్ మాదిరిగానే పనిచేస్తుంది. కానీ.. ఇందులో సాంప్రదాయ అంతర్లీన ఆస్తులు ఏమీ ఉండవు. ఈ కంపెనీలో లారాకి 12 శాతం వాటా ఉంది. ఒక బిలియన్ నిధుల రౌండ్ అనంతరం లారా అసెట్స్ విలువ నికరంగా 1.3 బిలియన్లకు పెరిగినట్లు అంచనా.

- Advertisement -
RELATED ARTICLES

Latest News