Monday, October 27, 2025
ePaper
Homeకరీంనగర్Phone | పోగొట్టుకున్న ఫోన్‌.. బాధితుడికి అందజేత..

Phone | పోగొట్టుకున్న ఫోన్‌.. బాధితుడికి అందజేత..

కొత్తపల్లి: ఓ వ్యక్తి పోగొట్టుకున్న ఫోన్‌(Phone)ను పోలీసులు రికవరీ (Recovery) చేసి అతనికి శుక్రవారం అందజేశారు. ఈ నెల 17న ఘటన జరగ్గా వారం రోజుల్లోనే ఫోన్ ఆచూకీ కనిపెట్టారు. దాడి ప్రణీత్ కుమార్ తన రియల్‌మీ(Realme) ఫోన్‌ని తీగలగుట్టపల్లి గ్రామ సమీపంలో పోగొట్టుకున్నాడు. వెంటనే అప్రమత్తమై కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌(Karim Nagar Rural Police Station)లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ ఫోన్‌ని సిఈఐఆర్ టెక్నాలజీ (CEIR Technology) ద్వారా పెద్దపల్లిలో ఉన్నట్లు గుర్తించారు. ఫోన్‌ని ప్రణీత్‌కు అప్పగించినట్లు రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి చెప్పారు. ఫోన్ రికవరీకి కృషి చేసిన కానిస్టేబుల్ విశ్వతేజను ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News