ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగవు..ఒకవేళ జరిగిన అవి ఎంతో కాలం నిలువవు. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలు కాకండి. ఆత్మహత్య చేసుకోకండి. గ్రామాలలో ప్రతినోటా వింటున్న మాట. అయితే, ఇక్కడ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్లాన్ బీ ఏమిటి అనేది పెద్ద ప్రశ్న? ప్రజలు కోర్టు తీర్పును తప్పకుండ గౌరవిస్తారు. ఓట్లు వేసి గెలిపించిన పార్టీని మాత్రం నమ్మరు. ఇక్కడ బీసీలు మాత్రం అసలు నమ్మరు. బీసీలు నమ్మాలి అంటే, విడుదల చేసిన నోటిఫికేషన్ కోర్టు కొట్టివేయకుండ ఉండాలి. కొట్టివేయకుండా కోర్టు ఉండాలి అంటే గొప్ప అద్భుతం జరుగాలి. ఆ..అద్భుతం ఏదో.. ఇప్పుడు ఉహించుకొని చెప్పండి!
తలారి సుధాకర్ కోహెడ