Wednesday, March 4, 2026
Homeఅంతర్జాతీయంIndia, ADB | ఇండియా, ఏడీబీ ఒప్పందాలు

India, ADB | ఇండియా, ఏడీబీ ఒప్పందాలు

ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(Asia Development Bank), ఇండియా మధ్య రుణ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. కీలకమైన ఐదు రంగాల్లో అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఈ ఒడంబడికలు (Agreements) చేసుకున్నాయి. నైపుణ్యాభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం(Renewable energy), ఆరోగ్య సంరక్షణ(Health Care), పట్టణ రవాణా(Urban Transport), స్థిరమైన జీవనోపాధి (Sustainable Livelihood) కల్పించేందుకు రూపొందించిన ఈ అగ్రిమెంట్ల విలువ 2.2 బిలియన్లు పైనే కావటం విశేషం.

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల శాఖ మార్గదర్శకత్వంలో ఈ ఒప్పందాలను ఖరారు చేశారు. రుణ పత్రాలపై మన ప్రభుత్వం తరపున డిప్యూటీ సెక్రటరీ సౌరభ్ సింగ్, రుణదాత తరఫున ADB ఇండియా రెసిడెంట్ మిషన్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్, డిప్యూటీ కంట్రీ డైరెక్టర్ ఆర్తి మెహ్రా సంతకం చేశారు. ఈ ఫైనాన్సింగ్ ప్యాకేజీలో అప్‌గ్రేడ్ చేసిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ ప్రోగ్రామ్ ద్వారా ప్రధాన్ మంత్రి స్కిల్లింగ్, ఎంప్లాయబిలిటీ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఒకటి. దీనికి 846 మిలియన్ డాలర్లు ఇస్తారు.

- Advertisement -

యాక్సిలరేటింగ్ అఫర్డబుల్ అండ్ ఇన్‌క్లూజివ్ రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లోని సబ్‌ప్రోగ్రామ్-1కి 650 మిలియన్లు కేటాయిస్తారు. అస్సాం స్టేట్ టెర్షియరీ హెల్త్ కేర్ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్‌కి 398 పాయింట్ 8 మిలియన్లు విడుదల చేస్తారు. చెన్నై మెట్రో రైల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్ ఫేజ్-2కి 240 మిలియన్ డాలర్లు విడుదల చేస్తారు. మేఘాలయలో ఇంటిగ్రేటెడ్ ఎకోటూరిజం, సస్టైనబుల్ అగ్రి-బేస్డ్ లైవ్లిహుడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కి 77 మిలియన్ డాలర్లు సాయం చేస్తారు.

12 రాష్ట్రాల్లో 650 పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఆధునీకరించడం, ఐదు జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థలను అత్యుత్తమ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయడం. తద్వారా భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న శ్రామిక శక్తిని సృష్టించడం నైపుణ్య కార్యక్రమ లక్ష్యం. పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ చలనశీలత, అధునాతన తయారీ వంటి అధిక వృద్ధి రంగాల్లో డిమాండ్ ఆధారిత కోర్సులను అందించడం ద్వారా కనీసం 1 పాయింట్ 3 మిలియన్ల యువతకు ఉపాధిని మెరుగుపరచాలని టార్గెట్ పెట్టుకున్నారు.

2027 నాటికి రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాట్లను విస్తరిస్తారు. 10 మిలియన్ల గృహాలకు తక్కువ ఖర్చుతో విద్యుత్ అందిస్తారు. ప్రధాన్ మంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజిలి యోజనకు రూఫ్‌టాప్ సోలార్ కార్యక్రమం సపోర్ట్‌గా నిలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ ప్రామాణిక మార్గదర్శకాలు, రంగాల వారీ సంస్కరణలు, తక్కువ మరియు మధ్య ఆదాయ కుటుంబాలకు తక్కువ వడ్డీ రుణాలను సులభంగా ఇవ్వడంపై దృష్టిపెడతారు.

ఆరోగ్య సంరక్షణ రంగంలో అస్సాం రాష్ట్ర తృతీయ ఆరోగ్య సంరక్షణ ఆగ్మెంటేషన్ ప్రాజెక్ట్ ద్వారా తృతీయ సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తారు. ఇందులో భాగంగా గౌహతి, దిబ్రూఘర్, సిల్చార్‌లోని వైద్య కళాశాలలను ఆధునికీకరిస్తారు. ఆరోగ్య సంరక్షణ, వైద్య విద్యలోని కీలకమైన అంతరాలను పరిష్కరిస్తారు. శ్రీమంత శంకరదేవ ఆరోగ్య శాస్త్రాల విశ్వవిద్యాలయం కింద ఈ సంస్థలను శ్రేష్ఠ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు.

చెన్నై మెట్రో రైల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రాజెక్ట్ రెండో దశలో కొత్త ఎలివేటెడ్, భూగర్భ కారిడార్ల ద్వారా మెట్రో నెట్‌వర్క్‌ విస్తరణ చేపడతారు. 18 అదనపు స్టేషన్లను నిర్మిస్తారు. ఈ స్టేషన్లలో వాతావరణ స్థిరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. తీవ్రమైన వాతావరణ సంఘటనల సమయంలో ప్రయాణికులకు భద్రత కల్పిస్తారు.

మేఘాలయ ఎకోటూరిజం మరియు స్థిరమైన వ్యవసాయ ఆధారిత జీవనోపాధి ప్రాజెక్ట్‌లో భాగంగా ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహిస్తారు. క్లైమేట్-స్మార్ట్ వ్యవసాయం, అటవీ సంరక్షణ ద్వారా వ్యవసాయ ఆదాయాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల 8 వేల కన్నా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా ఆర్థిక అవకాశాలను సృష్టిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News