Friday, September 12, 2025
ePaper
spot_img
Homeఅంతర్జాతీయంఅమెరికాలో లయన్ గంపా నాగేశ్వర్‌రావుకు అంతర్జాతీయ పురస్కారం

అమెరికాలో లయన్ గంపా నాగేశ్వర్‌రావుకు అంతర్జాతీయ పురస్కారం

లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H గవర్నర్, లయన్ గంపా నాగేశ్వర్‌రావు అంతర్జాతీయ వేదికపై ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండో నగరంలో జరుగుతున్న 107వ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ మహాసభల సందర్భంగా ఆయనకు మిషన్ 1.5 టూ క్లబ్ చార్టర్ అవార్డు ను ప్రదానం చేశారు.

ఈ పురస్కారం వెనుక ఒక నిర్దిష్ట లక్ష్యం ఉంది. లయన్స్ క్లబ్ సభ్యుల సంఖ్యను ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్లకు పెంచాలనే లక్ష్యంతో “మిషన్ 1.5” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా, తన జిల్లా పరిధిలో రెండు కొత్త క్లబ్‌లను విజయవంతంగా ఏర్పాటు చేసినందుకు గుర్తింపుగా ఆయనకు ఈ గౌరవం దక్కింది.

ఈ పురస్కారం పట్ల డిస్ట్రిక్ట్ 320H సభ్యులు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. గంపా నాగేశ్వర్‌రావు నాయకత్వ పటిమకు, సేవా నిరతికి ఈ అవార్డు ఒక నిదర్శనమని, ఇది తమ జిల్లాకే గర్వకారణమని పలువురు సీనియర్ లయన్ సభ్యులు ఈ సందర్భంగా కొనియాడారు.

ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా యువతకు నిరంతరం దిశానిర్దేశం చేసే గంపా నాగేశ్వర్‌రావు, మరోవైపు సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషం.

RELATED ARTICLES
- Advertisment -

Latest News