Thursday, February 5, 2026
Homeఆరోగ్యంAroma Therapy | ప్రశాంతతకు నిమ్మకాయ, ఉప్పు కాంబినేషన్..

Aroma Therapy | ప్రశాంతతకు నిమ్మకాయ, ఉప్పు కాంబినేషన్..

  • నెట్టింట హల్ చల్ చేస్తున్న ఆరోమా థెరఫీ..

సోషల్‌ మీడియాలో రోజుకో ట్రెండ్‌ను వైరల్‌ చేస్తుంటారు. ఫలితాలు ఎలా ఉన్నా.. చాలామంది దాన్ని ఫాలో అవుతుంటారు. ప్రస్తుతం.. ‘నిమ్మకాయ-ఉప్పు’ కాంబినేషన్‌లో.. ఓ సరికొత్త అరోమా థెరపీ నెట్టింట తెగ ప్రచారంలో ఉన్నది. ఓ నిమ్మపండును కోసి, దానిపై కాస్తంత ఉప్పు చల్లి.. బెడ్‌ పక్కన పెట్టుకోవడం చాలామందికి రివాజుగా మారింది. ఈ థెరపీ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇన్‌ఫ్లూయెన్సర్లూ చెబుతున్నారు. గాలిలోని బ్యాక్టీరియాను నిమ్మకాయ పీల్చుకుని.. గాలిని శుద్ధి చేస్తుందని చెబుతున్నారు. నిమ్మకాయలోని ‘లిమోనిన్‌’ అనే పదార్థం..

మంచి సువాసనను అందిస్తుంది. రాత్రంతా ఈ సిట్రస్‌ వాసనను పీల్చడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గి.. కంటినిండా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. జలుబు, సైనస్‌ ఉన్నప్పుడు.. ముక్కులు పట్టేస్తాయి. అదే నిమ్మ వాసన పీల్చడం వల్ల శ్వాస తీసుకోవడం తేలికగా అవుతుంది. అంతేకాకుండా, రాత్రంతా నిమ్మకాయ వాసన పీల్చడం వల్ల బీపీ కూడా తగ్గుతుందట. ఇక నిమ్మకాయ వాసన.. దోమలు, ఈగలు వంటి కీటకాలను దూరం కొడుతుంది. దాంతో దోమల బాధ తప్పుతుంది కూడా!

- Advertisement -
RELATED ARTICLES

Latest News