Saturday, April 4, 2026
Homeస్పోర్ట్స్Leander Paes | లియాండర్ పేస్ బెంగాలీ కాదా..?

Leander Paes | లియాండర్ పేస్ బెంగాలీ కాదా..?

  • నేను ఖచ్చితంగా బెంగాలీనే అంటున్న పేస్..

భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ బెంగాలీ కాదంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. తాను సౌరవ్‌ గంగూలీ ని కాదేమోగానీ కచ్చితంగా బెంగాలీనే అని చెప్పారు. పశ్చిమబెంగాల్‌ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల బీజేపీలో చేరిన పేస్‌.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ కార్యక్రమాలకు వెళ్లినప్పుడు ‘మీరు బెంగాలీయేనా’ అనే ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు. దీనపై పేస్ స్పందిస్తూ.. మీరు బెంగాలీయేనా అనే ప్రశ్న ఎదురైనప్పుడు తనకు చాలా బాధగా ఉంటుందని అన్నారు.

అయితే తన కుటుంబానికి పోర్చుగీస్ మూలాలు ఉన్నాయని తెలిపారు. తనవి మాత్రం భారతీయ మూలాలే అని స్పష్టంచేశారు. తాను కోల్‌కతాలో పుట్టానని, తన టెన్నిస్ ప్రయాణం సౌత్ క్లబ్‌లో ప్రారంభమైందని చెప్పారు. ఇక్కడి లా మార్టినియర్ పాఠశాలలో చదువుకున్న తాను, కోల్‌కతా నగర మైదానాల్లోనే ఆడుకున్నానని అన్నారు. ఈ నగరానికి గొప్ప క్రీడా చరిత్ర ఉందని కొనియాడారు. కానీ ప్రస్తుత బెంగాల్ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడం లేదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News