తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (Adviser to Govt) వేం నరేందర్ రెడ్డి(Vem Narender Reddy)ని పలువురు ప్రముఖులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి (Diwali) పండగ శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో.. మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వజ్రేష్ యాదవ్, ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి (Parameshwar Reddy), టిపిసిసి (TPCC) జనరల్ సెక్రెటరీ పీసరి మహిపాల్ రెడ్డి, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఉన్నారు.
