రేపటితో ముగియనున్న సమరం
20 జిల్లాల్లోని 122 సెగ్మెంట్లలో ఓటింగ్
1,302 మంది అభ్యర్థులు బరిలో
ఓటేయనున్న 3.7 కోట్ల మంది
బీహార్ శాసనసభ(Assembly)కు చివరి విడత (Final Round) పోలింగ్ రేపు (నవంబర్ 11న) ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుంది. పోటాపోటీగా సాగిన ప్రచారం నిన్న ఆదివారంతో ముగిసింది. ఎన్డీఏ(Nda), మహాఘట్ బంధన్ (Mahaghat Bandhan) నువ్వానేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేది అంతుచిక్కట్లేదు. మొత్తం 243 స్థానాలకు గాను 20 జిల్లాల పరిధిలోని 122 సెగ్మెంట్లకు రేపు పోలింగ్ (Polling) నిర్వహిస్తున్నారు. 1302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3.7 కోట్ల మంది ఓటేస్తారు. ఈ నెల 14న 243 నియోజకవర్గాల ఓట్లను లెక్కించి విజేతల(Winners)ను ప్రకటిస్తారు. మ్యాజిక్ ఫిగర్ (Magic figure) సాధించిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుంది. తాజా విడత పోలింగ్ కోసం 500కు పైగా కేంద్ర సాయుధ పోలీస్ బలగాలను(CRPF, BSF, CISF, ITBP,SSB) మోహరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించారు. పోలింగ్ రూమ్‌లోకి మొబైల్ ఫోన్లు అనుమతించరు.
