Homeజాతీయంఆర్జేడీకి 13వ సారి జాతీయ అధ్యక్షుడు కానున్న లాలూ

ఆర్జేడీకి 13వ సారి జాతీయ అధ్యక్షుడు కానున్న లాలూ

బీహార్‌ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూప్రసాద్‌యాదవ్ ఆ పార్టీకి 13వ సారి జాతీయ అధ్యక్షుడు కానున్నారు. ఈ మేరకు నామినేషన వేశారు. ఆయన ఇప్పటిదాక 12 సార్లు ఈ పదవిని చేపట్టారు. ఈ విషయాన్ని లాలూ చిన్న కొడుకు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తెలిపారు. లాలూజీ మరోసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయడంతో పార్టీ కార్యకర్తల నుంచి నేతల వరకు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. లాలూ నాయకత్వంలో ఆర్జేడీ మళ్లీ బీహార్‌లో అధికారంలోకి రాబోతోందని ధీమా వెలిబుచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News