Friday, October 3, 2025
ePaper
Homeఎన్‌.ఆర్‌.ఐడాలస్‌లో గాంధీజీకి కేటీఆర్ నివాళులు

డాలస్‌లో గాంధీజీకి కేటీఆర్ నివాళులు

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అమెరికాలోని డాలస్‌లో మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అమెరికాలోనే అతిపెద్ద బాపూజీ విగ్రహం డాలస్‌లో ఉంది. యూఎస్ పర్యటనలో భాగంగా కేటీఆర్ జాతిపిత విగ్రహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించారు. అహింస, సత్యాగ్రహంతో భారతదేశ ప్రజలందరినీ గాంధీజీ ఏకతాటిపైకి తీసుకొచ్చి, బానిస బతుకులకు స్వేచ్ఛాస్వాతంత్ర్యాలను తీసుకొచ్చేందుకు పాటుపడ్డారని కేటీఆర్ కొనియాడారు. అందుకే ఆయన విశ్వమానవుడు అయ్యారని, ప్రపంచవ్యాప్తంగా నేటికీ ప్రశంసలు పొందుతున్నారని చెప్పారు. విశ్వనేత విగ్రహాన్ని ఇంత భారీగా డాలస్‌లో ఏర్పాటుచేసిన తోటకూర ప్రసాద్ తదితరులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News