Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణKTR | కారు కావాలా...బుల్డోజర్ కావాలా..

KTR | కారు కావాలా…బుల్డోజర్ కావాలా..

జూబ్లీహిల్స్(JUBILEE HILLS) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా, బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో గరీబోళ్ల ఇళ్లు ఎక్కడుంటే అక్కడికి బుల్డోజర్లు పంపించి.. ఆ ఇళ్లని సీఎం రేవంత్ రెడ్డి కూలగొట్టిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఈ సందర్భంగా సూచించారు.

తెలంగాణ భవన్లో ఆదివారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్(BRS) లో పలువురు నేతలు చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్(CONGRESS) గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న ఆ పార్టీ నేతలు..ప్రస్తుతం రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నది ఎవరో చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్‌కి సోయి వస్తుందని ఎద్దేవా చేశారు.

రెండు సంవత్సరాల్లో సంపాదించిన మొత్తం అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్లో ఖర్చుపెడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు ఓటుకు రూ.10,000 ఇస్తారని ఆరోపించారు. బీజేపీ తెలంగాణకి పనికిరాని పార్టీ అని ఆక్షేపించారు. బీజేపీ(BJP) తెలంగాణ రాష్ట్రానికి పనికిరాని పార్టీ అని, కాంగ్రెస్ బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్లేనన్నారు. హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి గాడిన పడాలి అంటే కేసీఆర్ తిరిగి రావాల్సిందేనని..అది జూబ్లీహిల్స్ నుంచి మొదలు కావాల్సిందే కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News