Thursday, February 12, 2026
HomeతెలంగాణKTR | తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్

KTR | తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్

  • రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ రేవంత్‌రెడ్డి..
  • కేసీఆర్‌ చెప్పు ధూళికి కూడా సరితూగడు..
  • రాహుల్‌ గాంధీ లీడర్‌ కాదు.. రీడర్‌..
  • జనగామలో సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు..
  • అసెంబ్లీ గౌరవ సభ కాదు.. కౌరవ సభ
  • శాసనసభ బూతుల సభగా మారింది
  • అసెంబ్లీ జరుగుతున్న తీరుపై మండిపాటు..

సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ చెప్పు ధూళికి కూడా సరితూగడని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. మంగళవారం జనగామలో బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డిపైన, కాంగ్రెస్‌ ప్రభుత్వంపైన విమర్శల వర్షం గుప్పించారు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్‌ అని, అందుకే ఆయన తన తండ్రి అని గర్వంగా చెప్పుకుంటానని కేటీఆర్‌ అన్నారు. అలాంటి మొనగాడిని సవాలు చేస్తున్న రేవంత్‌ రెడ్డి అనేటోడు ఆయన చెప్పు ధూళికి కూడా సరిపోడని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఒక్క ప్రెస్‌ విరీట్‌ పెడితెనే రేవంత్‌ రెడ్డి ఆగమాగం అయితున్నడని, ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అక్కడే గుండె ఆగి సస్తడని అన్నారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధిద్దామని ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ సూచించారు.

కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతోనే ఓటు వేసి ఆయనను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్క సర్పంచి మున్సిపల్‌ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని కోరారు. వరంగల్‌ జిల్లాలో సర్పంచులు పెద్ద సంఖ్యలో గెలిచారని, రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, ఒత్తిళ్లకు గురిచేసినా పార్టీ కోసం నిలబడ్డారని ప్రశంసించారు. బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకుడికి ధన్యవాదాలు చెప్పారు. జనగామ ర్యాలీ చూస్తే ’కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు’ అనిపించిందని అన్నారు. ప్రజలు గులాబీ జెండాను చూడగానే చప్పట్లు కొడుతుంటే సంతోషం అనిపించిందని, కాళోజీ మాటలు గుర్తొచ్చాయని అన్నారు.

- Advertisement -

కేసీఆర్‌ ఎప్పుడు ముఖ్యమంత్రి అయితారా అని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర లేకున్నా అన్ని పదవులు ఇచ్చిన పార్టీని వదిలి కడియం శ్రీహరి సీఎం రేవంత్‌ రెడ్డితో కలిశాడని విమర్శించారు. ఇక్కడి నిబద్ధత కలిగిన కార్యకర్తలు బీఆర్‌ఎస్‌ బలపర్చిన 150 మంది సర్పంచులను గెలిపించారని మెచ్చుకున్నారు. చాకలి ఐలమ్మ, షేక్‌ బందగీ, దొడ్డి కొమురయ్య, రాణి రుద్రమదేవి పుట్టిన గడ్డ ఇదని కేటీఆర్‌ కీర్తించారు. సీఎం రేవంత్‌రెడ్డిపైన, రాష్ట్ర ప్రభుత్వంపైన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డి పాలన చేతగాక బీఆర్‌ఎస్‌ విరీద నిందలు వేస్తున్నాడని ఆరోపించారు. ఏదో అడ్డిమారి గుడ్డిసూటిల సీఎం అయిన రేవంత్‌రెడ్డి..

మూడేళ్లు టైమ్‌పాస్‌ చేసిపోక అవాకులు, చెవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి రైతులకు యూరియా ఇయ్య చేతగాదుగానీ.. అబద్దాలు అనర్గళంగా వస్తయని ఎద్దేవా చేశారు.’కేసీఆర్‌ను మల్ల మొలౖత్తనియ్యను’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి శపథం చేయడంపైనా కేటీఆర్‌ మండిపడ్డారు.. ’నువ్వేంది కేసీఆర్‌ను మొలౖత్తనియ్యకపోయేది’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. విరీ కాంగ్రెస్‌ పార్టీ 60 ఏండ్లు తెలంగాణను తొక్కిపట్టిందని, తెలంగాణను మొలౖత్తనివ్వమని విర్రవీగిందని, అసుంటి కాంగ్రెస్‌ పార్టీ మెడలు వంచి తెలంగాణను మొలిపించిన మొగోడు, మొనగాడు కేసీఆర్‌ అని వ్యాఖ్యానించారు. రైతులకు యూరియా ఇవ్వడంలో రేవంత్‌రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందని కేటీఆర్‌ విమర్శించారు.

సరిపడా యూరియా అందక రైతులు గోస పడుతున్నరని ఆవేదన వెలిబుచ్చారు. ’రేవంత్‌ పాలనలో యూరియా షాప్‌ల లేదు, యాప్‌ల లేదు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్తగా కార్డు అంటూ కొత్త పాట అందుకున్నరని అన్నారు. ’రైతులకు యూరియా తెలివిలేక నాటకాలాడుతున్న దద్దమ్మలు ఈ కాంగ్రెసోళ్లు’ అని మండిపడ్డారు. కేసీఆర్‌ హయాంలో రైతులకు సరిపడా ఎరువులు అందాయని, ఎరువుల దుకాణాల ముందు రైతులు లైన్‌లలో నిలబడాల్సిన అసవరం రాలేదని కేటీఆర్‌ గుర్తుచేశారు. కేసీఆర్‌ స్వయంగా రైతు కాబట్టి రైతుల సమస్యలు తెలుసని, ఆయన రేవంత్‌రెడ్డిలా రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌ కాదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ తీరుపై మండిపడ్డ కేటీఆర్‌ :

తెలంగాణ అసెంబ్లీ నడుస్తున్న తీరుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. అసెంబ్లీ గౌరవ సభ కాదని.. కౌరవ సభ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శాసనసభ బూతుల సభగా మారిందని మండిపడ్డారు. మంగళవారం నాడు జనగామలో పర్యటించిన కేటీఆర్‌.. రాహుల్‌ గాంధీ లీడర్‌ కాదని.. రీడర్‌ అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. వరంగల్‌లో రైతులకు ఇచ్చిన హావిరీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హావిరీలను మరిచిన రాహుల్‌ గాంధీని ఉరితీ యాలని కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యకర్తలకు పలు కీలక సూచనలు చేశారు. ’కుటుంబం అన్నాక గొడవలు ఉంటాయని..

అలుగుడు గులుగుడు ఉంటది, సర్దుకుపోవాలన్నారు. లేదం టే.. కాంగ్రెస్‌ వాళ్లకు సందు దొరుకుతది’ అని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌ రెడ్డి నిస్సిగ్గుగా ఇచ్చిన హావిరీలన్నింటినీ మర్చిపోయారని కేటీఆర్‌ విమర్శించారు. కేసీఆర్‌ను ఉరి తీయాలని రేవంత్‌ రెడ్డి అన్న కామెంట్స్‌ని ప్రస్తావించిన కేటీఆర్‌.. చావునోట్లో తలపెట్టి తెలంగాణను తెచ్చినందుకు కేసీఆర్‌ను ఉరి తీయాలా? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో రైతుల అవస్థలను కూడా కేటీఆర్‌ ప్రస్తావించారు. యాప్‌లో యూరియా దొరకక రైతులు అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News