- “కృష్ణవేణి సీడ్స్” హైబ్రిడ్
- రకం “కె.ఎస్ 941’ఉత్తమం
- విజయవంతం గా కమలాపురం లో “రైతు పంట క్షేత్ర ప్రదర్శన”దినోత్సవం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గోదావరి నది తీర ప్రాంతంలో అద్భుతమైన అత్యధిక మిరప పంట దిగుబడి కి ‘కృష్ణవేణి సీడ్స్” కంపెనీ వారి నుంచి నూతనంగా వచ్చిన హైబ్రిడ్ కె.ఎస్941రకం విత్తనం అత్యుత్తమ మైందని ఆ కంపెనీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎం.డి) శంకర్ రెడ్డి పేర్కొన్నారు. ములుగుజిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామంలో మిర్చి రైతు పల్లా బాబు సాగు చేసిన ‘కృష్ణవేణి సీడ్స్” వారి నుంచి వచ్చిన” హైబ్రిడ్ KS 941″ మిరప రకంపై “రైతు పంట ప్రదర్శన” క్షేత్ర దినోత్సవాన్ని సోమవారం పెద్ద ఎత్తున విజయవంతంగా నిర్వహించారు.
పంటలో ఏ రకం తెగుళ్లు కూడా లేకుండా అద్భుతమైన అత్యధిక పంట దిగుబడి కలిగి ఉందని, KS 941విత్తనాలు వేసిన రైతు పూర్తిగా సంతోషంగా ఉన్నాడని పొలాన్ని సందర్శించే రైతులు కూడా పూర్తిగా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు, కృష్ణ వేణి KS 941మిరప రకం మంచి పంట అమరికను కలిగి ఉన్నందున, ప్రస్తుత పంట ఎకరానికి కనీసం 25నుండి 30 క్వింటాళ్ల దిగుబడిని ఇస్తుందని తమతోపాటు అన్నధాతలు కూడా భావిస్తున్నార న్నారు.
పంటక్షేత్ర ప్రోగ్రామ్ లో మంగపేట మండల రైతులు ఏటూరునాగారం మండల రైతులు &పినపాక మండల బట్టుపల్లి, కరకగూడెం రైతులు 200 మంది కి పైగా పాల్గొన్నారు, కృష్ణవేణి సీడ్స్ ఎండి శంకర్ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్ రాయల చంద్రశేఖర్ , కృష్ణవేణి సీడ్స్ రీజనల్ మేనేజర్ (ఆర్.ఎం) రమేష్ సేల్స్ ఆఫీసర్ బసారికారి రాజు ఈ పంట క్షేత్ర దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో కమలాపురం రైతులు కమలాపురం ఉత్తమ గ్రామ రైతులు ఈడుపుగంటి వెంకటేశ్వర్లు, చింత పున్నారావు, చింత గోపాలకృష్ణ, మా కంపెనీ కొలీగ్స్ పలువురు హాజరు కావడం జరిగింది,ఈ హైబ్రిడ్ మంచి పనితీరుతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారన్నారు .
