- నీటి సంరక్షణ–నది శుద్ధీకరణ’ ప్రాజెక్టుతో రాష్ట్ర స్థాయికి ఎంపిక
- అభినందించిన కోట విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ డి అంజిరెడ్డి
కరీంనగర్ జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్‌లో కోట పబ్లిక్ స్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థి కొమ్ము జోయల్ ప్రథమ బహుమతి దక్కించుకున్నాడు. “నీటి సంరక్షణ మరియు నిర్వహణ (నది శుద్ధీకరణ)” అంశంపై జోయల్ రూపొందించిన ప్రాజెక్టు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకొని అందరి ప్రశంసలు పొందింది. ఈ విజయంతో అతడు రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌కు ఎంపిక అయ్యాడు.
ఈ సందర్భంగా కోట రెసొనెన్స్ జూనియర్ కళాశాలలు మరియు కోట పబ్లిక్ స్కూల్ చైర్మన్ డాక్టర్ డి. అంజిరెడ్డి జోయెల్‌ను మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా కోట విద్యాసంస్థల అధినేత డాక్టర్ డి అంజిరెడ్డి మాట్లాడుతూ…
విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు, శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు విద్యాసంస్థల్లో తమ వంతు కృషి కొనసాగుతుందని ఆయన తెలిపారు. జోయల్ సాధించిన ఈ విజయంతో పాఠశాల పేరు మరింత ఎత్తుకు వెళ్లిందని పేర్కొన్నారు. జన జీవనానికి అత్యంత కీలకమైన నీటి సంరక్షణపై అవగాహన పెంచే విధంగా జోయల్ చేసిన ప్రాజెక్టు న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. నదుల కాలుష్యానికి కారణాలు, శుద్ధీకరణ పద్ధతులు, ప్రజల్లో అవగాహన అవసరం వంటి అంశాలను తన నమూనాలో ప్రతిబింబించాడు. రాష్ట్రస్థాయిలో కూడా ఇదే ప్రతిభను కనబరుస్తాడన్న నమ్మకం ఉందన్నారు కరీంనగర్ లోని కోట పబ్లిక్ స్కూల్లో జరిగిన అభినందన కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు
