Monday, October 27, 2025
ePaper
Homeఆంధ్రప్రదేశ్Tiruvuru | మరోసారి వార్తల్లో నిలిచిన కొలికపూడి

Tiruvuru | మరోసారి వార్తల్లో నిలిచిన కొలికపూడి

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శాసన సభ్యుడు (టీడీపీ) కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మరోసారి వార్తల్లో నిలిచారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని(Kesineni Chinni)తో వివాదం నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. వాళ్లిద్దరి మధ్య ఇన్నాళ్లూ మాటల యుద్ధం జరగ్గా అది ఇప్పుడు బ్యాంక్ లావాదేవీల దాక వచ్చింది. ఎమ్మెల్యే (Mla) టికెట్ కోసం చిన్నీకి డబ్బు ఇచ్చానంటూ కొలికపూడి వాట్సప్ స్టేటస్ (WhatsApp Status) పెట్టారు. చిన్నీకి ఇచ్చిన డబ్బుల వివరాలను వెల్లడించారు. మరిన్ని విషయాలను రేపు (శుక్రవారం) మాట్లాడుకుందామని అన్నారు. వీళ్లిద్దరితోనూ టీడీపీ (Tdp) ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఎన్టీఆర్ భవన్‌(Ntr Bhavan)లో మాట్లాడి వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టనున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News